గ్రాడ్యుయేట్లకు నాన్-ఇమిగ్రెంట్ వీసా : అమెరికా
అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్-ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది. నిర్దిష్ట దరఖాస్తులకు మినహాయింపులను ఎప్పుడు సిఫారసు చేయాలనే దానిపై జూలై 15న కాన్సులర్ అధికారులకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వర్క్ వీసా జారీ ప్రక్రియను క్రమబద్దీకరించడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో ఈ మార్పులు ప్రతిపాదించిది. కొత్త పథకం ప్రకారం అర్హులైన దరఖాస్తుదారులు నాన్-ఇమిగ్రెంట్ వీసాలను మరింత త్వరగా అందుకుంటారు. కొత్త ప్రతిపాదనలు అమలులోకి వస్తే పెద్దసంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు.







