అమెరికా కీలక నిర్ణయం.. భారతీయులకు ఇక ఐదేళ్లు
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాదిమంది భారతీయులకు శుభవార్త. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల (ఈఏడీ) విషయంలో అగ్రరాజ్య వలసల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు కొన్ని వలసేతర విభాగాలకు చెందిన వారికి వెసులుబాటు కల్పిస్తూ ఈఏడీల చెల్లుబాటు వ్యవధిని గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచింది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్ పెండింగులో ఉన్నవారికీ ఈ నిర్ణయం లబ్ది చేకూర్చనుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, గ్రీన్‌కార్డు దరఖాస్తు పక్రియలో ఆఖరి దశ. ఇది పూర్తికావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ దరఖాస్తు పెండింగులో ఉన్నా, ఈఏడీ కోసం దరఖాస్తు చేసుకొని అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ విధానం సెప్టెంబరు 27, 2023 నుంచి పెండింగులో ఉన్న దరఖాస్తులకు వర్తిస్తుందని తెలిపింది.













