త్వరలో హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు పెంపు?
నిధుల సమీకరణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వ యంత్రాంగం హెచ్-1బీ వీసా దరఖాస్తు ధరను త్వరలో పెంచేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు అమెరికన్ చట్టసభ్యులకు లేబర్ సెక్రటరీ అలెగ్జాండర్ అకోస్టా ప్రతిపాదనలు అందజేశారు. 2020 వార్షిక బడ్జెట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కు నిధులు కేటాయింపు కమిటీ 1 అక్టోబర్, 2019న సమావేశం కానుంది. అయితే హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు ఎంతవరకు పెంచేది వివరాలను లేబర్ సెక్రటరీ అకోస్టా వెల్లడించలేదు. ఏయే కేటగిరీల అభ్యర్థుల విషయంలో ఈ నిర్ణయం అమలవుతుందనేది ఆయన తెలపలేదు. గత అనుభవాన్ని పరిశీలిస్తే ఇండియన్ ఐటీ కంపెనీలు అధిక సంఖ్యలో హెచ్-1బీ అప్లికేషన్స్ కలిగి ఉన్నాయి. వీటిపైనే హెచ్-1బీ ఫీజు పెంపు భారం పడే అవకాశం ఉంది.













