పాక్‌లోనే దావుద్ : అమెరికా
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడని అమెరికా సృష్టం చేసింది. దావుద్ ఉగ్ర కార్యకలాపాలు, డీ-కంపెనీ వ్యవహారాలు కరాచీ కేంద్రంగా జరుగుతున్నాయన్నది. దావుద్ సన్నిహితుడు, ఇంగ్లాండ్ జైలులో ఉన్న జబీర్ మోతివాలాను అప్పగించాలని కోరుతూ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరిగింది. ఎఫ్బిఐ తరపున జాన్ హార్డీ వాదిస్తూ దావూద్ ఇబ్రహీం, అతడి సోదరుడు 1993 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి పారిపోయాడని, ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఓ గుర్తుతెలియని ప్రాంతో నివసిస్తున్నారని చెప్పారు. జబీర్ మోతివాలాపై అమెరికాలో పలు కేసులున్నాయన్నారు. ముగ్గురు ఎఫ్‌బీఐ విశ్వసనీయ వక్తులు జబీర్ను 2011లో అమెరికాలో, 2011, 2012లో పాక్‌లో కలుసుకొన్నారన్నారు.













