పాకిస్థాన్ కు అమెరికా షాక్
పాకిస్థాన్‌కు అమెరికా షాకిచ్చింది. ఉగ్రవాద నిర్మూలన కోసం పాక్ సర్కారుకు అందజేయాలనుకున్న రూ.2 వేల కోట్ల సాయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాద నిర్మాలనకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందుకు ఆ సాయాన్ని రద్దు చేశామని అగ్రరాజ్యం వెల్లడించింది. ట్రంప్ దక్షిణాసియా విధానానికి పాక్ మద్దతివ్వడం లేదని, ఉగ్రవాద సంస్థలకు కొమ్ముకాస్తోందని, లష్కరే తాయిబా, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్ర సంస్థలకు పాక్ స్వర్గధామంగా మారిందని పెంటగాన్ ఆ ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడింది. పాకిస్థాన్‌కు అమెరికా 2002 నుంచి అప్పటి వరకు రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిందని, ఆ నిధుల వినియోగంపై అబద్ధాలు చెప్పడతే తప్ప ఆశించిన ఫలితాలు ఒనగూరలేదని దుయ్యబట్టింది.













