ట్రంప్ ట్రావెల్ నిషేధాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనధికారికంగా అమెరికా వచ్చే వారిపై విధించిన నిషేధాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై విధించిన నిషేధం వివక్షతో కూడుకున్నదన్న వాదనని తోసిపుచ్చింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ప్రభుత్వ పాలసీలపై తొలిసారి తీర్పుని ప్రకటించింది. ఐదుగురితో కూడిన బెంచ్ అత్యధికుల అభిప్రాయం ఇదేనని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ ప్రకటించారు. వలస విధానాన్ని రూపొందించడానికి అధ్యక్షుడికి విస్తృతమైన అధికారాలు ఉంటాయని సృష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లిం వ్యతిరేకమైనదన్న ఆరోపణని కొట్టి పారేసింది. అయితే ట్రంప్ సాధారణ వలసలపై చేసిన రెచ్చగొట్టే మాటలను కాని, ప్రత్యేకంగా ముస్లిం వలసదారుల పట్ట ఆయన వాడిన పదజాలాన్ని గాని చీఫ్ జస్టిస్ రాబర్ట్ ప్రస్తావించలేదు. వలసదారులపై విధించిన నిషేధం గత డిసెంబర్లో కోర్టు ఎత్తివేయడానికి నిరాకరించడంతో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలవుతోంది.













