భారత్ తో కలసి పోరాడుతామన్న అమెరికా
ఉగ్రమూకల పీచమణచాలంటే ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సూసైడ్ బాంబర్ దాడి ఘటనను ప్రపచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళుతున్న కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఢీకొట్టిన ఘటనలో 43 మంది జవాన్లు అమరులు కాగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల చర్యను అమానవీయ ఘటనగా వర్ణించిన అమెరికా ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్ర దాడిని హేయమైన చర్యగా ప్రకటించిన ఆస్ట్రేలియా ఉగ్ర పోరుపై భారత్‌తో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా దాడిని ఖండించి అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపాయి.













