యుద్ధం జరిగితే భారత్‌కే అండగా ఉంటాం
గత 50 రోజులుగా భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పరిపక్వత కలిగిన దేశంగా వ్యవహరిస్తోందని యూఎస్ నావాల్ వార్ కాలేజీ వ్యూహరచనా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రక్షణ నిపుణుడు ఆర్.జేమ్స్ హోమెస్ వ్యాఖ్యానించారు. చైనా మాత్రం చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తోందని అన్నారు. డోక్లాం విషయంలో భారత్‌పై చైనా తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోందని, వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ చూపడం లేదని, బలీమైన పొరుదేశం భారత్‌తో వివాదాన్ని కొనసాగించాలని చైనా ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాద పరిష్కార విషయంలో అమెరికా చొరవచూపినా ప్రయోజనం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఒకవేళ భారత్, చైనా మధ్య యుద్దం జరిగితే, భారత్‌వైపే అమెరికా నిలుస్తుందని నిస్సందేహంగా భావించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ వ్యవహరిస్తున్న తీరును మెచ్చుకున్నారు.













