పాక్ కు అమెరికా షాక్
తమ సైనికులకు ఇచ్చే మిలటరీ శిక్షణా కార్యక్రమాన్ని అమెరికా నిలిపివేసినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. గురువారం మంత్రిత్వ శాఖ ప్రకటించగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దారి తీయవచ్చునని అనధికారిక సమాచారం. పాకిస్థాన్‌కు భద్రత దృష్ట్యా అమెరికాలో పాకిస్థాన్ సైనికులకు ఇచ్చే శిక్షణను నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది మొదట్లో అమెరికా వెల్లడించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారిందని, ఆఫ్ఘాన్ నుంచి దాడులకు పాల్పడే వారికి దారి సుగుమం చేస్తుందని అమెరికా ఆరోపించగా పాకిస్థాన్ ఖండించింది.













