అమెరికాలో యోగాపై నిషేధం ఎత్తివేత
అమెరికాలో యోగాపై నిషేధాన్ని ఎత్తివేశారు. 1993లో అలబామా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధించిన నిషేధాన్ని అలబామా ప్రతినిధుల సభ తొలగించింది. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు జెరిమీ గ్రే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 84-17 ఓట్లతో ఆమోదించింది. దీంతో యోగా బిల్లును పునరుద్ధరించారు. అయితే నమస్తేకు మాత్రం దూరంగా ఉండాలని సభ పేర్కొనడం గమనార్హం. కరోనా బారిన పడకుండా సామాన్యుడి నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు నమస్తే పెడుతుంటే నమస్తేను సభ నిషేధించడం విశేషం. మరోవైపు అమెరికాలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు విద్యార్థులకు ఉచితంగా 60 రోజుల పాటు వైపై సేవలు అందించనున్నారు.













