పదేళ్ళ వయస్సు లోపు పిల్లలకు ఆయుధాలు
పదేళ్ళ కన్నా తక్కువ వయస్సున్న పిల్లలు తమ వెంట సొంత హంటర్గన్ను తీసుకెళ్ళేందుకు అనుమతిస్తూ అమెరికాలోని విస్కాన్సిస్ రాష్ట్రంలో చట్టాలను సవరించారు. గత వారంలో ఈ కొత్త చట్టంపై రిపబ్లికన్ గవర్నర్ స్కాట్ వాకర్ సంతకం చేయగా, శనివారం నుండి అమలులోకి వచ్చింది. టెక్సాస్లోని సండే చర్చిలో సామూహిక కాల్పులు జరిగిన రెండు వారాల తరువాత ఈ చట్టం అమలులోకి రావడం విశేషం. పెద్దల సమక్షంలో పిల్లలు వేటాడటంపై పలు ప్రావిస్స్లు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. 12 సంవత్సరాలు అంతకు మించి వయస్సున్న పిల్లలు ఎలుగు బంటి, జింక వంటి జంతువులను వేటాడేందుకు అనుమతించాయి. తాజాగా 10 సంవత్సరాల లోపు పిల్లలు వేటాడేందుకు వున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. శిక్షణ పొందిన పెద్దవారు పక్కన ఉన్నపుడు పిల్లలు తమ వెంట వేటాడే ఆయుధాన్ని తీసుకు వెళ్ళవచ్చనని ఆ చట్టం పేర్కొంది. చట్టాలను రూపొందించిన వారిలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎస్ఆర్ఎ), విస్సాన్సిస్ బేర్ హంటర్స్ అసోసియేషన్లు ఉన్నాయి.













