రంగంలోకి దిగిన అమెరికా ఇంటెలిజెన్స్
కోవిడ్-19 విస్తరించిన దేశాల సంఖ్య 50 దాటిపోవడంతో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వైరస్ను ఎదుర్కొనే సామర్థ్యం ఏయే దేశాలకు ఉంది? వేటికి లేదు అన్న దిశగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా భారత్లో జనాభా ఎక్కువ కావడం, ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్ను ఎలా ఎదుర్కొంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్లో మూడు కేసులు నిర్థారణ అయ్యాయి. వారు కోలుకున్నారు కూడా. మరో 23,531 మందిని కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.













