భారత్కు నాటో హోదా
భారత్కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు సంబంధించిన శాసనసభ నిబంధనకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల భారత్-అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు అవకాశముంటుంది. దీంతో అమెరికా నాటో మిత్రపక్ష దేశాలైన ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాల సరసన భారత్ నిలవనుంది. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ రక్షణ అధికార చట్టం (ఎన్డీఏఏ) బిల్లును యూఎస్ సెనేట్ ఆమోదించింది. దీని ద్వారా హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడంతో పాటు, మానవతా సహాయం, ఉగ్రవాద నిర్మూలన, సముద్ర ప్రాంతంలో భద్రత వంటివి పెంపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుంది.













