భారత్‌కు అమెరికా రాయబారిగా కెన్ జస్టర్!
భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్‌ను నియమించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆ దేశ సెనెట్‌లో ఓటింగ్ జరగనుంది. భారత్, అమెరికాల మధ్య కీలకమైన పౌర అణుఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర వహించిన జస్టర్‌ను భారత్‌కు రాయబారిగా పంపటంలో అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అప్పటి వరకూ భారత్‌లో రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ రాజీనామా సమర్పించారు. అతని స్థానంలో కెన్ జస్టర్‌ను ట్రంప్ ప్రతిపాదించారు. ఇదే సమయంలో మరో 14 దేశాలకు రాయబారుల నియామకాలపైనా సెనెట్‌లో ఓటింగ్ జరుగనుంది.













