భారత్‌తో కలిసి పనిచేస్తాం :అమెరికా
ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా కృత నిశ్చయంతో ఉందని ఆదేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ తెలిపారు. భారత్‌లో పర్యటనకు వచ్చిన టిల్లర్సన్ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలు, ప్రాంతీయ భద్రత, ఆప్ఘనిస్తాన్‌లో భారత్ పాత్ర తదితర విషయాలను ఉభయులూ చర్చించారు. అనంతరం టిల్లర్ సన్, సుష్మాస్వరాజ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా, భారత్ సహజ మిత్రదేశాలీ, ఉగ్రవాదంపై సమష్టి పోరును కొనసాగిస్తామని టిల్లర్ సన్ తెలిపారు. ఉగ్రవాదాలకు ఆశ్రయమిచ్చే దేశాలను ఉపేక్షించేంది లేదని పాక్‌కు ఆయన చురకలు అంటించారు. పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని, పాక్ ప్రభుత్వ స్థిరత్వాన్ని ఆ ఉగ్రసంస్థలు సవాలు చేస్తున్నాయని అన్నారు. దీర్ఘకాలంలో పాక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల దృక్పథంతో పాక్‌తో పనిచేయాలని తాము కోరుకుంట్నుట్లు తెలిపారు. ఆప్ఘనిస్థాన్‌లో భారత్ పాత్రను కూడా ప్రశంసించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు సాగించే విషయంలో తమ సమావేశంలో మరోసారి దృఢనిశ్చయం వ్యక్తమైందని సుష్మాస్వరాజ్ తెలిపారు. హెచ్1బీ వీసాలతో యూఎస్ఏలో పనిచేస్తున్న భారతీయుల కీలక పాత్రపై కూడా సమవేశంలో చర్చించినట్లు తెలిపారు.













