పాక్ కలలకు అమెరికా ఎదురుదెబ్బ!
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో చేరాలన్న పాకిస్థాన్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ. అణు వాణిజ్యంతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆ దేశానికి చెందిన ఏడు సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. అమెరికా పరిశ్రమలు, భద్రత, వాణిజ్య సంస్థ తమ వెబ్సైట్లో ఈ నెల 22న ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ భద్రత, విదేశీ విధానాలకు వ్యతిరేకంగా సదరు ఏడు సంస్థలు పని చేస్తున్నాయని ఆరోపించింది. ఈ సంస్థలు అమెరికాలో వ్యాపారం చేయాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఆంక్షలకు గురైన వాటిలో పాక్కు చెందిన ముష్కో ఎలక్ట్రానిక్స్, సొల్యుషన్స్ ఇంజినీరింగ్ తదితర సంస్థలున్నాయి. ఎన్ఎస్జీలో చేరాలని పాక్ కంటున్న కలలకు అమెరికా తాజా చర్య ఎదురుదెబ్బే













