అమెరికా బెదిరింపులను తాము పట్టించుకోం
రష్యాతో క్షిపణుల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే భారత్‌పై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా చేస్తున్న బెదిరింపులను తాము పట్టించుకోబోమని భారత్ సృష్టం చేసింది. రష్యాతో క్షిపణి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఇప్పుడు తుది దశలో వున్నాయని, త్వరలోనే ఈ ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేస్తాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సృష్టం చేశారు. భారత్ సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికాతో పంచుకునే అంశంపై ఇంకా ఒప్పందం తుది నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. రష్యాతో క్షిపణి కొనుగోళ్లకు సంబంధించిన అమెరికా ఆంక్షల చట్టం కానీ, ఐరాసకు సంబంధించిన చట్టం కానీ భారత్‌కు వర్తించబోవని తాను ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి వర్గానికి సృష్టం చేసినట్లు తనకు కలిసిన మీడియా ప్రతినిధులకు వివరించారు.













