భారతీయులకు గ్లోబల్ ఎంట్రీ
ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలోకి అడుగుపెట్టడానికి అనుమతించే గ్లోబల్ ఎంట్రీ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్ ఎంట్రీని గతంలో రూపొందించింది. అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయలు గ్లోబల్ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సిస్టం (గోస్) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్ రాయబారిగా ఉన్న నవతేజ్ సింగ్ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేసుకుంటున్న తొలి భారతీయుడయ్యారు.













