భారత్ నుంచి స్వదేశానికి 4 వేల మంది అమెరికన్లు
భారత్ నుంచి 6000 మంది అమెరికన్లను స్వదేశానికి రప్పించుకునే ప్రయత్నాలు అమెరికా ప్రారంభించి ఇంతరకు 4000 మందిని రప్పించుకున్నట్టు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 122 దేశాల నుంచి 65000 మంది అమెరికా పౌరులను, వారి కటుంబీకులను 687 విమానాల ద్వారా రప్పించడానికి అమెరికా విదేశాంగ శాఖ సహకరించిందని వీరిలో పాక్ నుంచి వచ్చిన వెయ్యి మంది అమెరికా పౌరులు ఉన్నారని చెప్పారు. భారత్ నుంచి 4000 కన్నా ఎక్కువ మంది అమెరికా పౌరులను రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో మరో నాలుగు విమానాలు పంపనున్నట్టు రాజ్యాంగ వ్యవహారాల ప్రిన్సిపల్ డిప్యుటీ అసిస్టెంట్ సెక్రటరీ ఐయాన్ బ్రౌన్లీ పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు.













