ఆ జాబితాలో భారత్ ఉండదు … అమెరికా
భారత్‌ను తన కరెన్సీ పర్యవేక్షిత జాబితా నుంచి అమెరికా ప్రభుత్వం తొలగించింది. ప్రధాన సమస్యలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కొన్ని పరిణామాల కారణంగా ఈ అడుగు వేసినట్లు సృష్టం చేసింది. తన ప్రధాన వాణిజ్య భాగస్వాములను ఈ జాబితాలో ఉంచి అమెరికా పరిశీలిస్తూ ఉంటుంది. కాగా, స్విట్జర్లాండ్‌ను కూడా జాబితా నుంచి తొలగించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, ఐర్లండ్, సింగపూర్, మలేషియా, వియత్నాంలు ఈ జాబితాలో కొనసాగుతున్నాయి. భారత్‌ను పర్యవేక్షిత జాబితా నుంచి తొలగించాం. మూడు అర్హతల్లో ఒకదానిని సాధించింది. వరుస రెండు నివేదికల్లో అమెరికాతో ద్వైపాక్షిక అదనపు నిల్వలను మెరుగ్గా కొనసాగించిందని అమెరికా ఆర్థిక శాఖ తన తాజా పాక్షిక వార్షిక నివేదికలో పేర్కొంది.













