హెచ్-1 బీ రెన్యువల్స్ .. కొత్త విధానంపై ఆందోళన!
అమెరికా తాజాగా తెరపైకి తేనున్న ప్రయోగాత్మక హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని డిపెండెంట్స్( కుటుంబ సభ్యుల)కు వర్తింపజేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్-1బీ వీసాలపై అమెరికాలోని కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న వేలాది మంది భారతీయ టెకీలకు ఇది పెద్ద సమస్య కానుందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. గత జనవరిలో ప్రకటించిన ఈ విధానం ప్రకారం హెచ్-1బీ వీసాదారులు రెన్యువల్/స్టాంపింగ్ కోసం మాతృదేశానికి వెళ్లాల్సిన అవసరముండదు. కేవలం ఆన్లైన్లో రెన్యువల్ దరఖాస్తు చేసుకుంటే చాలు. అయితే ఆ దరఖాస్తు ఆమోదు ప్రక్రియలో ఉన్నకాలంలో వారు అమెరికాను వీడి వెళ్లకూడదు. అమెరికాలోనే రెన్యువల్/ స్టాంపింగ్ అనేది ఇంకా పైలెట్ ప్రాజెక్టు దశలోనే ఉన్నందున తొలుత కేవలం 20,000 దరఖాస్తూలనే అనుమతించనున్నట్టు కాన్సులర్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. ఇది కొత్త విధానమేమీ కాదు. కాకపోతే గత 20 ఏళ్లలో ఎన్నడూ దీన్ని అమలు చేయలేదు. ఈ దృష్ట్యా ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడనున్నాం. ఫలితాలను బట్టి దీన్ని ఏ మేరకు ముందుకు తీసుకెళ్లారో నిర్ణయానికి వస్తాం అని వివరించారు.













