డబ్ల్యూహెచ్వో తో అమెరికా తెగతెంపులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో తాము పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఆయన శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీలో నమోదై, తమ దశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్ల్యూహెచ్వోకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ చెప్పారు.













