నేనొచ్చే వరకూ అదే జరిగింది : ట్రంప్
కరోనా వైరస్ విషయంలో చైనా భారీ తప్పుడు ప్రచారాలకు తెర తీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ నిద్ర మొహం జోయ్ బిడెన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించేందుకు చైనా ఇవన్నీ చేస్తోంది. తద్వారా అమెరికాను దోచేయొచ్చని చైనా భావిస్తోంది. దశాబ్దాలుగా అదే జరిగింది. నేనొచ్చే వరకూ ఆ దోపిడీ కొనసాగింది అని ట్రంప్ ట్వీట్ చేశారు. చైనా అసమర్థత వల్లే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది చనిపోతున్నారని ధ్వజమెత్తారు.చైనా అధికార ప్రతినిధి చాలా తెలివితక్కువగా మాట్లాడారు. ఆ దేశం నుంచి ప్రపంచమంతా వ్యాపించిన వైరస్ సృష్టిస్తున్న మారణ హోమం, కష్టాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టు మాట్లాడారు అని అన్నారు. చైనావి దోపిడీ ఆర్థిక విధానాలని, అక్కడ మానవహక్కుల ఉల్లంఘనలూ కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వైట్‌హౌస్ ఆరోపించింది.













