యూఎస్ ఓపెన్‌కు స్విత్లోనా, బెర్టెన్స్ దూరం
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ ఆశ్లే బార్టీ దూరం కాగా, తాజాగా ఎలీనా స్విత్లోనా, కికి బెర్టెన్స్ ఈ జాబితాలో చేశారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. టోర్నీ కోసం నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుండటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ అమెరికాకు వెళ్లి నాతో పాటు నా సహాయక సిబ్బందికి ప్రమాదంలోకి నెట్టదల్చుకోలేను అని స్విత్లోనా ట్వీట్ చేసింది.













