చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా
దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు మరోసారి వేడెక్కాయి. ఈ సముద్ర జలాల్లో వివాదాస్పదంగా మారిన స్ప్రాట్లీ దీవుల సమీపంలోకి అమెరికా రెండు యుద్ధ నౌకలను పంపించింది. క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ స్ప్రువాన్స్, యూఎస్ఎస్ ప్రెబల్ స్ప్రాట్లీ దీవులకు 12 నాటికల్ మైళ్ల పరిధిలోకి ప్రవేశించాయని అమెరికా నౌకాదళం వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనంటూ చైనా చేస్తున్న ప్రకటనలను సవాలు చేసేందుకు తాము యుద్దనౌకలను పంపించినట్లు తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎక్కడికైనా సరే తాము వెళ్తామని సృష్టం చేసింది. అమెరికా చర్యపై చైనా అగ్రహం వ్యక్తం చేసింది.













