అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. తాజాగా ఇరాన్‌కు చెందిన ఒక మానవరహిత డ్రోన్ హర్ముజ్ జలసంధిలో కూలిపోయింది. ఈ డ్రోన్‌ను తామే కూల్చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హార్జుజ్ జలసందికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఇరాన్‌కు చెందిన ఓ డ్రోన్ నౌకను అడ్డుకునే ప్రయత్నించింది. సదరు నౌకకు దాదాపు 1000 గజాల దూరంలోకి వచ్చింది. ఎన్ని సార్లు హెచ్చరించినా వినకుండా అక్కడే సంచరించింది. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న తరుణంలో నౌకను, సిబ్బందిని రక్షించేందుకు ఈ చర్యకు చేపట్టాల్సిన వచ్చిందని ట్రంప్ తెలిపారు.













