చైనాకు అమెరికా ఝలక్!
అమెరికా యుద్ధ నౌకలను కూల్చే ఆయుధ సంపత్తి చైనా వద్ద ఉందంటూ చెబుతున్న ఓ నివేదికపై అమెరికా నౌకాదళం ఘాటుగా స్పందించింది. చైనాను చూసి బెదిరేది లేదని ట్విటర్ ద్వారా తేల్చి చెప్పింది. ఇటీవల రెండు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు యూఎస్ఎస్ నిమిట్జ్, రోనాల్డ్ రీగన్లను (ఫైటర్ విమానాలను తరలించగలిగిన యుద్ధ నౌకలు) అమెరికా దక్షిణ చైనా సముద్రం వైపుగా తరలించిన విషయం తెలిసిందే. చైనా నావికాదళం ఆ సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేపడుతున్న సమయంలోనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లను అక్కడ మోహరించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే అమెరికా ఈ చర్య చేపట్టింది.













