అమెరికా వ్యాపారవేత్తకు ఐదేండ్ల జైలు
మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన అమెరికా వ్యాపారవేత్తకు ఐదేండ్ల జైలు శిక్ష పడింది. 15 ఏండ్ల బాలికతో సొంత జెట్‌లో ప్రయాణిస్తూ విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి నిందితుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం స్టీఫెన్ బ్రేడ్లీ మెల్(53) అనే వ్యాపార వేత్త గతేడాది డిసెంబరులో ఓ మైనర్ బాలికపై విమానంలో లైంగికడాదికి పాల్పడ్డాడు. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. స్టీఫెన్ మెల్ ఓ బ్రోకరేజీ సంస్థ యజమాని. ఇతనికి సొంత విమానం ఉంది. బాధితురాలైన బాలిక తల్లి తన కుమార్తెకు ఫైలట్ శిక్షణ ఇవ్వాల్సిందిగా స్టీఫెన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో బాలికను ఒంటరిగా విమానంలో తీసుకెళ్లి స్టీఫెన్ ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈయనపై మరో లైంగికదాడి కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తీర్పు జులైలో వెలువడనుంది.













