అమెరికాలో మరోసారి జాతి విద్వేష దాడి
అమెరికాలో తాజాగా మరోసారి జాతి విద్వేష దాడి చోటు చేసుకుంది. ఒరెగాన్ రాష్ట్రంలోని ఓ స్టార్లో పని చేస్తున్న భారత సంతతి వ్యక్తి హర్వీందర్ సింగ్ డోడ్ అనే అనే సిక్కును గడ్డం పట్టుకుని లాగిన తెల్లజాతియుడు అండ్రూ రామ్సే, ఆయనను కింద పడేసి అత్యంత దారుణంగా పిడికిలితో గుద్ది, కాలుతో తన్నాడు. సింగ్ మతం గురించి తెలుసుకునే నిందితుడు జాతి విద్వేష దాడికి పాల్పడినట్లు తన కథనంలో ఫాక్స్ 12 టివీ పేర్కొంది. నిందితుడికి ఐడి కార్డు లేకపోవడంతో సిగరెట్ రోలింగ్ పేపర్లు ఇచ్చేందుకు సింగ్ తిరస్కరించడంతో ఘటన చోటు చేసుకుంది.













