ఎంత అదృష్టం….మూడు లాటరీలు కొట్టిన అమెరికన్!
అదృష్టమంటే అతనిదే. సాధారణంగా ఒక లాటరీ తగిలితేనే అది ఎంతో సంబరపడాల్సిన విషయం. ఒకే రోజు మూడు లాటరీలు తగిలితే..న్యూయార్క్‌కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ కు ఈ పరిస్థితే ఎదురైంది. ఆయన జీవితంలో అత్యంత శుభ దినం, ఏకంగా మూడు లాటరీల్లో విజేతగా నిలువగా, మొత్తం 50 లక్షల 600 డాలర్లు (సుమారు రూ.36,24 కోట్లు) లభించాయి. ఈ విషయాన్ని ఆయన మీడియాకు చెబుతూ, స్క్రాచ్ లాటరీ గేమ్‌లో 50 లక్షల డాలర్లు, రెండోసారి 500 డాలర్లు, మూడోసారి 7,276 డాలర్లను తాను గెలుచుకున్నాని చెప్పాడు. ఆగస్టు 2న ఈ ఘటన జరిగిందని లాటరీ నిర్వాహకులతో తన పేరును బయట పెట్టవద్దని కోరానని చెప్పిన ఆయన ఇప్పటికి బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ డబ్బును తన కుటుంబానికి, వ్యాపారాభివృద్ధికి వాడుకుంటున్నానని చెప్పారు. కాగా, ఈ సంవత్సరంలో ఆరంభంలో అతనికి మరో లాటరీలో 2,500 డాలర్లు లభించడం గమనార్హం.













