అమెరికా సంచలన నిర్ణయం!
అత్యంత ప్రమాదకర దేశాలుగా పేర్కొంటూ నిషేధం విధించిన 11 దేశాలపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయా దేశాల శరణార్థులకు కూడా ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం ఎత్తివేసినప్పటికీ అమెరికాలో ప్రవేశించాలని కోరుకునే వారికి గతంలో కంటే మరింత కట్టుదిట్టమైన తనిఖీలు తప్పవని ట్రంప్ ప్రభుత్వం సృష్టం చేసింది. తీవ్రవాదులు, నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు, శరణార్థుల నేపథ్యం, వ్యక్తిగత వివరాలపై అధికారులు అణువణువూ శోధించనున్నారు. ఇందుకోసం అమెరికా సరికొత్త తనిఖీ ప్రక్రియను అమలు చేయనున్నట్లు సమాచారం. అమెరికాలో ప్రవేశంపై నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై, 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.













