హెచ్ 1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వంటి పని ఆధారిత వీసాలపై తాత్కాలిక నిషేధం విధించాలని భావిస్తున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే ఆయన గ్రీన్‌కార్డుల జారీని రెండు నెలలపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హెచ్ 1బీ, హెచ్ 2బీ వంటి పని ఆధారిత వీసాలపై ట్రంప్ కన్ను పడిందని స్థానిక మీడియా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా. ఇదే జరిగితే భారత్, చైనాకు పెద్ద ఎదురుదెబ్బ కానున్నది. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది హెచ్ 1బీ వీసాదారులు ఉన్నారు.













