భారత్ కు జీఎస్పీ హోదా పునరుద్ధరించండి
భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదాను పునరుద్ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అక్కడి చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులు కోరారు. అందులో 26 మంది డెమొక్రాట్లు కాగా, 18 మంది రిపబ్లికన్లు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంరద మోదీ అతి త్వరలో అమెరికాలో పర్యటించనున్న తరుణంలో అక్కడి చట్టసభల ప్రతినిధులు ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 5 నుంచి భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదాను అమెరికా ఉపసంహరించుకుంది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పి) అనే కార్యక్రమం ద్వారా వాణిజ్య ప్రాధాన్య హోదా కల్పించిన దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులకు అమెరికా సుంకాల మినహాయింపు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా అధికంగా లబ్ది పొందుతూ వచ్చిన ఎగుమతి దేశాల్లో భారత్ ఒకటి.













