కొత్త నిబంధనల్ని తెచ్చిన అమెరికా
అమెరికా నుంచి చైనాకు జరుగుతున్న ఎగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సివిల్ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలు, సెమీకండక్టర్లను సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతిపై నిఘా పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం చైనాలోని సైనిక సంస్థలకు ఈ ఉత్పత్తులను అమ్మాలనుకుంటే అమెరికా సంస్థలు ప్రభుత్వంపై నుంచి లైసెన్సులు పొందాల్సిందే. ఒకవేళ ఈ ఉత్పత్తులను సైనిక అవసరాలకు కాకుండా పౌర అవసరాల కోసం విక్రయించినా అనుమతులు తప్పనిసరి. సైనిక అవసరాల కోసం అమెరికా సంస్థల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను దుర్వినియోగం చేసిన చరిత్రలున్న దేశాలతో వ్యాపార సంబంధాలను నిశితంగా గమనించాల్సిన అవసరం చాలా ఉన్నది అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ తెలిపారు.













