డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద ప్రేలాపనలకు ప్రతినిధుల సభ చెక్ పెట్టింది. ప్రతినిధుల సభ నిర్ణయంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే అధికారం కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అవసరమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి తొలిగిస్తూ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్లు కూడా ఉన్నారు. ఈ తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించడంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కోల్పోయారు. ఆయన ఇప్పుడు ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోలేరు. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమానీ హత్యకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడమే కారణం అని ఆయన ఒహియా సభలో స్వయంగా చేసిన ప్రకటనతో తేటతెల్లం కావడంతో ఆయన దూకుడును తగ్గించేందుకే ప్రతినిధుల సభ కీలకమైన ఈ తీర్మానాన్ని చేసింది.













