డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ విధానం సహా తమ దేశంలో శాశ్వత సభ్యత్వానికి అవకాశం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలని పట్టుదలగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనికోసం ఉద్దేశించిన సరిహద్దు భద్రతా ఇమిగ్రేషన్ సంస్కరణల చట్టం అమెరికా ప్రతినిధుల సభలో వీగిపోయింది. ఈ చట్టం ఆమోదం కోసం ట్రంప్ చివరివరకు యత్నించినా రిపబ్లికన్ ఆధిపత్యం గల ప్రతినిధుల సభలో 121-300 ఓట్ల తేడాతో ఓడిపోయింది. వలసదారుల హక్కుల పరిరక్షించడానికి ఓటింగ్ ఫలితం కొత్తదారిని ఇస్తుందని రిపబ్లికన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.













