భారతీయులకు షాక్ ఇచ్చిన అమెరికా.. వీసాల అప్లికేషన్ ఫీజుల పెంపు
అమెరికా వెళ్లే భారతీయులపై ఇక మరింత భారం కానుంది. హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత మళ్లీ ఇప్పుడేనని బైడెన్ సర్కారు వెల్లడిరచింది. తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను 3,765 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.







