ట్రంప్, కిమ్ సదస్సుకు కసరత్తు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ రెండవ శిఖరాగ్ర సదస్సు వివరాలను ఖరారు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఉత్తర కొరియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీఫెన్ బేగన్ దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఇయు యాంగ్తో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారని దక్షిణ కొరియా అధ్యక్ష భవనం తెలిపింది. చర్చలకు ముందుగా ఉత్తర కొరియా పట్ల అమెరికా వైఖరిని స్టీఫెన్ వివరించారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారంలో పానున్జోమ్లో గానీ పోన్గ్యాంగ్లో గాని ఇరువురు సమావేశం కావచ్చునని భావిస్తున్నారు. అయితే వీరి సమావేశంలో ఏ అంశం చర్చకు వచ్చిందనే వివరాలను అధ్యక్ష భవనం వెల్లడించలేదు.













