కరోనా వైరస్ నీడలో, అమెరికా లో డ్రగ్ మరణాలు
అమెరికా దేశం లో మాదక ద్రవ్యాల వాడుక ఎక్కువే, వాటి ద్వారా వచ్చే మరణాల సంఖ్య కూడా ఎక్కువే అని అందరికి తెలిసిన విషయమే. గత 25 సంవత్సరాలలో మొదటిసారిగా 2018 లో మాదక ద్రవ్యాల వలన సంభవించే మరణాల సంఖ్య బాగా తగ్గిన నేపధ్యం లో 2019 లో ఈ మరణాలు రికార్డు సంఖ్యకు పెరిగాయి మరియు 2020లో పెరుగుతూనే ఉన్నాయి. ఇది కరోనావైరస్ సంక్షోభం వలన ఏర్పడిన ఈ సంఖ్య పెరుగుతోందని ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.
మాదకద్రవ్యాల మరణాల సమాచారం ప్రకారం గతేడాదితో పోల్చితే 2020 లో ఇప్పటివరకు మాదక ద్రవ్యాల మరణాలు సగటున 13 శాతం పెరిగాయి అని తెలిసింది. ఈ ధోరణి ఇలాగె కొనసాగితే, 2020 వార్షిక మాదకద్రవ్యాల మరణాల సంఖ్య 2016 వార్షిక మాదకద్రవ్యాల మరణాలను సంఖ్యను దాటే అవకాశం ఉంది అని అంచనా. కరోనా వైరస్ సృష్టించిన పరిస్థితులు మాదకద్రవ్యాల సంబంధిత మరణాలపై పోరాడటంలో అమెరికా పురోగతిని దెబ్బతీయవచ్చు, కాని కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందే అమెరికాలో మాదకద్రవ్యాల కారణంగా మరణించినవారు అధికంగా ఉన్నారు అన్ని అనేక ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.
శాన్ ఫ్రాన్సిస్కొలోని కాలిఫోర్నియా వైద్య విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ డాన్ సిక్కరోన్ మాట్లాడుతూ “కోవిడ్-19 మాదకద్రవ్యాల సంబంధిత మరణాలని మరింత పెంచుతుంది.” అని తెలిపారు. ‘
కరోనా వైరస్ కారణంగా “సామాజిక-ఒంటరితనం” లాంటి నియమాలతో మాదకద్రవ్యాలని నియంత్రించడానికి లేదా మాదకద్రవ్యాలని తీసుకోకుండా ఆపడానికి ఆ వ్యక్తి పక్కన ఎవరు ఉండరు. గ్రూప్ కౌన్సెలింగ్ సెషన్లతో సహా మరియు నివాస చికిత్స కేంద్రాలలో మాదకద్రవ్యాల తో ప్రభావితమైన వ్యక్తులు ఉండటం వంటివి కుదరవు , మాదకద్రవ్యాల చికిత్సకు కీలకమైన భావోద్వేగ మద్దతు చాలా తక్కువ అవుతుంది, ఇలాంటి కారణాలవల్ల మాదకద్రవ్యాల ముప్పు పెరిగే అవకాశం ఉందని’ తెలిపారు.













