ఆయనను ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్
సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సెలవు మీద ఫ్లోరిడాలో గడుపుతున్న ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. వేల మంది అమెరికన్ల మరణానికి, క్షతగాత్రులు కావడానికి సులేమానీని కారణం. మరెంతో మందిని చంపడానికి కుట్ర పన్నాడు. లక్షల మంది అమాయకుల మరణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనే బాధ్యడు. సలేమానీని చూసి ఇరాన్ ప్రజలే భయపడుతున్నారు, ద్వేషిస్తున్నారు. అలాంటి వ్యక్తులు హతమైనందుకు వారు కొంచెం కూడా బాధపడబోరు అని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఆయన జాతీయ జెండాను ఫొటోను ట్వీట్ చేశారు.













