సయీద్ కు మరో ఎదురుదెబ్బ
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రదారి హఫీజ్ సయీద్ రాజకీయ ఆకాంక్షలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అతడు స్థాపించిన రాజకీయ పార్టీ ఎంఎంఎల్ (మిల్లీ ముస్లిం లీగ్)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా( జేయూడీ) సంస్థకు రాజకీయ విభాగమే ఎంఎంఎల్. అలాగే ఎంఎంఎల్ కేంద్ర కమిటీలోని ఏడుగురిని విదేశీ ఉగ్రవాదులుగా అమెరికా పేర్కొంది. తెహ్రీక్-ఏ-ఆజాదీ-ఏ-కశ్మీర్(తజ్క్)ను కూడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. తజ్క్ పేరిట లష్కరే తాయిబానే పాకిస్థాన్లో స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగుతున్నాయనే తమ వాదనకు అమెరికా తాజా ప్రకటన బలం చేకూర్చిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది.













