అప్పుల వేటలో అగ్రరాజ్యం
కరోనా దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా కూడా భారీ అప్పుల వేటలో పడింది. పరిస్థితి ఇలానే ఉంటే జూన్ చివరి నాటికి ఖజానాలో 80,000 కోట్ల డాలర్లకు మించి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2.9 లక్షల కోట్లు డాలర్లు (రూ.217.5 లక్షల కోట్లు) అప్పు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో చేసిన 47,700 కోట్ల డాలర్ల అప్పులతో పోలిస్తే ఇది ఏకంగా 2,42,300 కోట్ల డాలర్లు ఎక్కువ. అప్పుల వేట ఇలానే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అగ్రరాజ్యం అప్పులు, ఆ దేశ జీడీపీకి సమానమవుతాయని అంచనా.






