హెచ్-4 వీసాలపై త్వరలో విచారణ
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్-4 వీసా వ్యవస్థను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఆలకించేందుకు అమెరికాలోని అప్పిల్లేట్ కోర్టు అనుమతినిచ్చింది. ఒరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు ఈ హెచ్-4 వీసా విధానం తెచ్చారు. దీని వల్ల దాదాపు లక్షమంది దాకా భారతీయ టెకీలు, డాక్టర్లు, ఇతర రంగాల వారి భార్యలు లేదా భర్తలు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూండేవారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ఫస్ట్ నిర్ణయం తీసుకుని ఈ హెచ్-4 వీసా సిస్టంకు చెల్లుచీటి పాడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. పౌరసత్వ, వలస విభాగం దీనిపై కసరత్తు చేసి కొత్త రూల్ రూపొందించినా దానిని ఇంతవరకూ నోటిపై చెయ్యలేదు. ఈ ఆలస్యాన్ని సవాలు చేస్తూ సేవ్ జాబ్ అమెరికా అనే గ్రూప్ గతంలోనే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే కోర్టు పాత విధానాన్ని సమర్థించింది. దీంతో ఆ గ్రూప్ అప్పిల్లేట్ కోర్టుకు వెళ్ళగా దానిని కోర్టు పెండింగ్లో పెట్టింది. ఇపుడు ఆ పెండింగ్ ఉన్న పదాన్ని ఎత్తేసి విచారణకు తలుపు తెరిచింది.













