హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు ప్రతిపాదనపై స్టే
హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జీ జెఫ్రీ వైట్ నిలిపివేశారు. వేర్వేరు వీసాలపై పెద్ద మొత్తంలో ఫీజు పెంపు ప్రతిపాదనపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సవరించిన ఫీజులు అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కోర్టు స్టే విధించింది. ప్రతిపాదిత ఫీజు పెంపు నిర్ణయం, ఆదేశాలు జారీ చేసిన అధికారులను వారి స్థానాల్లోకి సరైన విధానంలో నియమించలేదు. కాబట్టి ఆ అధికారుల ప్రతిపాదనలు చట్ట విరుద్ధమని ఎనిమిది స్వచ్ఛంధ సేవా సంస్థలు కోర్టులో సవాలు చేశారు. తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు పలు ఇమ్మిగ్రెంట్ సర్వీసులు అందించే ఈ స్వచ్ఛంద సేవాలు ట్రంప్ సర్కార్ వీఫా ఫీజు పెంపు ప్రతిపాదనపై స్టే విధించాలని కోరాయి.
కొన్ని రకాల ఫీజు పెంపుతో సమాజంలోని పలు వర్గాలకు హానికరమని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ ప్రతిపాదలను కోర్టు నిలుపుదల చేసింది. ఇదిలా వుండగా యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదన ప్రకారం హెచ్ 1 బీ వీసా ఫీజు 21 శాతం అంటే పెరిగి 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు చేరాల్సి ఉంది. ఏల్-1 వీసాల ఫీజు ఏకంగా 75 శాతం మేర పెంచి 805 డాలర్లుగా ప్రతిపాదించారు.













