అనాథ చిన్నారిని దత్తత తీసుకున్న అమెరికా దంపతులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ చెందిన ఆర్పీఎఫ్ జవానుకు కాలూపురా రైల్వేస్టేషన్లో అనుమానాస్పదస్థితిలో ఒక బాలిక లభ్యమైంది. ఆ చిన్నారిని ఆయన పాలడీలోని శిశు గృహానికి అప్పగించారు. అక్కడ పెరుగుతున్న ఆ చిన్నారిని అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నర వయసు గల ఆ చిన్నారి ఇప్పుడు తమకు దొరికిన అమానాన్నలతో అమెరికా వెళ్లిపోనుంది. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఈ దంపతులు తమకు పిల్లలు కలిగేముందు ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని భావించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ దత్తత కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్, చైల్డ్ వేల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారికి అమెరికా తల్లిదండ్రులు క్రాంతి మోహన్ అని పేరు పెట్టారు. క్రాంతి తండ్రి శ్యామ్ మోహన్ కేరళ నివాసి. అయితే అమెరికాలో పెరిగి పెద్దయి అక్కడే స్థిరపడ్డారు. ఆ చిన్నారిని దత్తత తీసుకున్నందుకు అమెరికా జంట ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తమ చిన్నారికి భారత గొప్పదనం గురించి చెబుతామని వారంటున్నారు.













