ఆ అధికారిని విధుల నుంచి తొలగింపు : అమెరికా
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల మృతిపై పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి చులకనగా మాట్లాడటం విమర్శలకు దారితీయగా, తాజాగా సంబంధిత అధికారిని ఆ విధుల నుంచి తప్పించారు. జాహ్నవి ఈ ఏడాది జనవరిలో అమెరికాలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్ని మృతిచెందారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఓ పోలీసు ఆమె మృతిపై చులకనగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్, దక్షిణాసియా కమ్యూనిటీ ఒత్తిడి తేవడంతో తాజాగా అక్కడి అధికారులు ఆ పోలీసు అధికారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.













