US-India: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలక కేంద్రం
ఆటా హైదరాబాద్ బిజినెస్ సెమినార్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక కేంద్రంగా హైదరాబాద్ మారిందని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు. శుక్రవారం, హైదరాబాద్ టి హబ్ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిం చిన హైదరాబాద్ బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మధు యాష్కీ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మెన్ శివసేనారెడ్డి, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, సిఐఐ వైస్ ప్రెసిడెంట్ గౌతం రెడ్డి, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటగా తెలుగులో అందరికి నమస్కారం… అందరూ మంచిగున్నారా… అంటూ… అందరినీ ఉత్సాహపరి చారు. భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికే అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని వెల్లడిరచారు. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక నమ్మకం, భాగస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ వేగంగా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదుగు తోందని లారా విలియమ్స్ ప్రశంసించారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో హైదరా బాద్ సాధించిన ప్రగతి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. పరిశో ధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సా హక విధానాలు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలబెడు తున్నాయని ఆమె అన్నారు. అలాగే ఐటీ పరంగా ఇన్నోవేటివ్ ఐడియాలకు కేంద్రంగా టి హబ్ మారిందని, స్టార్టప్‌లు, గ్లోబల్ కార్పొరేట్లు, పెట్టుబడి దారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే టి-హబ్ నమూనా దేశానికే ఆదర్శమని ఆమె అన్నారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణ, కీలక మౌలిక సదుపాయాల భద్రతలో భారత్-అమెరికా సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందని అమెరికా యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ సూచించారు. అమెరికా, భారతదేశాల మధ్య వారధిగా వ్యవహరి స్తున్న ఆటా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. అమెరికాలో ఎదిగి తాము పుట్టిన ప్రాంతానికి ఏదో ఒక్కటి చేయాలనే ఉద్దేశ్యంతో ఆటా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలను వివరించారు.
అనంతరం ఈ సెమినార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుందని, ఐటీ భద్రత, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతున్న తీరు, గ్లోబల్ సరఫరా గొలుసుల్లో కీలక భాగస్వామిగా మారుతున్న అంశాలపై వక్తలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు వున్నారు.
వైజాగ్ అభివృద్ధిలో అమెరికా పెట్టుబడులు కీలకం: లారా విలియమ్స్
విశాఖపట్నం అభివృద్ధిలో అమెరికా పెట్టుబడుల పాత్ర కీలకమని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన వాణిజ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతోందని లారా విలియమ్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడం ఈ ప్రాంత ప్రగతికి నిదర్శనమని ఆమె కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతి కతలపై యువ పారిశ్రామికవేత్తలు దృష్టి సారించ ాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘క్వాంటం వ్యాలీ’ విజన్‌ను ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ సదస్సులో అమెరికన్ తెలుగు అసోసియే షన్ అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడు తూ, అమెరికాలో తెలుగు వారి జనాభా గణనీయంగా పెరిగిందని వెల్లడిరచారు. గతంలో 3.2 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా ప్రస్తుతం 12.3 లక్షలకు చేరుకుందని, అమెరికాలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం తెలుగు వారి పెట్టుబడులు 215 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, దీనిని 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ అసోసియేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఏర్పడుతున్న డేటా సెంటర్లు, ఏఐ సాంకేతికత కొత్త స్టార్టప్‌ల ఆవిర్బా Ûవానికి బాటలు వేస్తాయని ఆటా నూతన అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు ప్రభాకరరావు మాట్లాడుతూ, పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఏపీ ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తోందని అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధి డాక్టర్ రాధా రఘురామపాత్రుని మాట్లాడు తూ, ఆంధ్రప్రదేశ్ కేవలం ముడి పదార్థాల సరఫరాకే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వామిగా మారుతోం దని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యూఎస్ కాన్సులేట్ జనరల్ బృందం గీతం యూనివర్సిటీ లోని పరిశోధన కేంద్రాలను, డేటా సెంటర్లను సందర్శించింది. సదస్సులో ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు, డాక్టర్ గురజాడ రవికుమార్, పలువురు పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు.













