అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ భారత్ పర్యటన
భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ భారత్‌లో పర్యటించనున్నారు. భరాత్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై ఆయన ప్రధానంగా భారత నేతలతో చర్చించనున్నారు. మాట్టిస్ తన పర్యటనలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరపడంతోపాటుగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశానికి చెందిన ఒక కేబినెట్ స్థాయి మంత్రి భారత్ పర్యటించడం ఇదే మొదటిసారి,













