డొనాల్డ్ ట్రంప్ సర్కారుపై దావా
విద్యార్థి వీసా విధానంలో మార్పులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై నాలుగు అమెరికా కళాశాలలు కోర్టుకెక్కాయి. ఉత్తర కరోలినా జిల్లా కోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ప్రపంచ విద్యా కేంద్రంగా అమెరికా స్థానాన్ని తాజా మార్పులు ప్రభావితం చేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. ముఖ్యంగా వీటితో విదేశీ విద్యార్థులు అమెరికాకు రావడం కష్టమవుతుందని వివరించారు. ఉత్తర కరోలినాలోని గిల్ఫోర్డ్ కాలేజీ ఇంటర్నేషనల్ క్లబ్, న్యూయార్క్‌లోని ద న్యూ స్కూల్, కాలిఫోర్నియాలోని పూత్హిల్-డీ అంజా కమ్యూనిటీ కాలేజీ, హేవ్ఫోర్డ్ కాలేజీ ఈ దావాను వేశాయి. ఈ నాలుగు కళాశాలల్లో భారతీయులు సహా విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతుంటారు.













