సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, డీఎంకేకి చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని లూయిస్విల్లే పట్టణంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 3న తేదీన సనాతన ధర్మ దినోత్సవం నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది. కెంటకీ రాష్ట్రంలోని ఈ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మేయర్ క్రెయిగ్ గ్రీన్బెర్గ్ ప్రకటించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు రవి శంకర్, చిదానంద సరస్వతి, పరమార్థ నికేత్ అధ్యక్షుడు రిషికేశ్, భగవతి సరస్వతి తదితరుల సమక్షంలో ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సనాత ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబరు 2న వ్యాఖ్యలు చేయగా, ఆ తర్వాతి రోజునే సనాతన ధర్మ దినోత్సవం గా ఎంపిక చేయడం గమనార్హం.













